రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేసిన -జిల్లా వ్యవసాయ అధికారి కె.జయదేవ్
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 28, మహానంది:
మహానంది మండల పరిధిలోని గోపవరం, గాజులపల్లె గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల గొడౌన్లలో ఉన్న ఎరువులు, స్టాక్ రిజిస్టర్ లో ఉన్న ఎరువుల పరిమాణానికి సరిగ్గా ఉన్నాయా లేదా అనే దాని గురించి మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి కె.జయదేవ్ తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానంది మండలంలో ఇప్పటివరకు 1390 మెట్రిక్ టన్నుల రసాయని చేరువులను రైతులకు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఇంకా రైతు భరోసా కేంద్రాలలో 27 టన్నుల రసాయనిక ఎరువులు ప్రస్తుతం రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతు భరోసా కేంద్ర సిబ్బంది ఎరువులను ఎప్పటికప్పుడు రైతు భరోసా కేంద్రాలలో నిల్వ ఉంచాలని, అదేవిధంగా స్టాక్ రిజిస్టర్ లను సక్రమంగా మైంటైన్ చేయాలని తెలిపారు. వచ్చే ఖరీఫ్ సీజన్ కు గాను ఏప్రిల్ నెలలో రైతు భరోసా కేంద్రాల గోడౌన్లలో ఎరువులను ముందుగానే అందుబాటులో ఉంచుతామన్నారు.ఈ కార్యక్రమంలో నంద్యాల సహాయ వ్యవసాయ సంచాలకులు డి రాజశేఖర్, మార్క్ఫెడ్ అసిస్టెంట్ మేనేజర్ యు. అనూష, టెక్నికల్ ఏవో హరిప్రియ, హబ్ మేనేజర్ ఎమ్. ఉష రాణి, మండల వ్యవసాయ అధికారి బి. నాగేశ్వర రెడ్డి, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది హరిత, పల్లవి, ఇంద్రాణి పాల్గొన్నారు.