*తిరుమల శ్రీవారికి RBI జరిమానా విధించడం అన్యాయం! రాయలసీమ కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి*
తిరుపతి
తిరుమల తిరుపతి దేవస్థానంలోని బ్యాంకు డిపాజిట్లు,నగదు కేటాయింపులు,జీతాల చెల్లింపులు, కొనుగోళ్లు వాటి సంరక్షణ బాధ్యత
FA & CAO (ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్) పై ఉంటుంది టీటీడీ ఎస్బిఐ ఖాతాలో విదేశీ కరెన్సీ కి మూడు కోట్ల జరిమానా ఆర్బిఐ విధించడానికి అధికారులే బాధ్యత వహించాలి అని తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు తెలిసో తెలియకో తప్పు చేస్తే “శ్రీవారి కానుక” పేరుతో టీటీడీ ఉన్నతాధికారులు జరిమానా విధించి శ్రీవారి హుండీలో వేయిస్తారు మరి మూడు కోట్ల రూపాయల జరిమానాకు బాధ్యులైన అధికారిపై టిటిడి ఉన్నతాధికారులు ధర్మకర్తల మండలి ఆర్బిఐ విధించిన జరిమానాను సైతం రికవరీ చేయాలి!తిరుమల శ్రీవారికి భక్తులు భక్తితో సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిది ప్రతి పైసాకి టీటీడీ ఉన్నతాధికారులు ధర్మకర్తల మండలి జవాబుదారితనంగా వ్యవహరించాలి అదేవిధంగా తిరుమల శ్రీవారికి దేశ విదేశాల నుంచి కానుకల రూపంలో భక్తులు ఇచ్చే కరెన్సీని టీటీడీ స్వీకరించాలంటే కేంద్ర హోంశాఖ నుంచి (FCRA) ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలకు లోబడి స్వీకరించాలి టీటీడీకి FCRA గడువు ముగిసి రెన్యువల్ అనుమతులు కేంద్రం నుంచి రాకపోవడంతో ఆర్.బి.ఐ మూడు కోట్లు జరిమానా విధించడం శ్రీవారి భక్తులందరికీ ఎంతో ఆవేదన కలిగిస్తుంది!కేంద్ర మంత్రులు తిరుమల శ్రీవారి దర్శనానికి నెలలో కనీసం ఇద్దరు ముగ్గురు వస్తూనే ఉంటారు వారి ద్వారా FCRA అనుమతులకు ప్రయత్నించకపోవడం శోచనీయం
రాష్ట్ర ప్రభుత్వం,టిటిడి ఉన్నతాధికారులు,ధర్మకర్తల మండలి, ఢిల్లీ లోని లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు కేంద్ర హోంశాఖ,ఆర్థిక శాఖ మంత్రులతో నేరుగా కలిసి ఆర్బిఐ TTD కి విధించిన జరిమానా ఉపసంహరించుకొనేలా అలాగే టిటిడి కి FCRA అనుమతులు వచ్చేలా చూడాలన్నారు.