*వైయస్సార్ ఆసరా పై జరగబోయే సభను విజయవంతం చేయండి.*
— ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు..
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణ నందు సోమవారం ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అధ్యక్షతన ఎంపీడీవో కే.జాన్ లింకన్ ఆధ్వర్యంలో మూడోవ విడుత వైయస్సార్ ఆసరా పై మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఎనర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ల,డ్వాక్రా యానిమేటర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 29వ తేదీ అనగా బుధవారం మండల స్థాయిలో ఆలమూరులోని ఎర్ర కొలనీ వద్ద జరగబోయే మూడోవ విడుత వైయస్సార్ ఆసరా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వారు తెలియజేసి గ్రామస్థాయిలో ఉన్నటువంటి లబ్ధిదారులు అందరికీ సరియైన అవగాహన కల్పించి సభలో పాల్గొనే విధముగా తగు ఏర్పాట్లు చేయవలసిందిగా వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్,చెముడులంక గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్, తోరాటి రాంబాబు,నాతి కుమార్ రాజా, ఏవో రామ స్వరూప్, ఏపీఎం ధనరాజు, ఇంచార్జ్ ఏపీవో ప్రసాద్, టెక్నికల్ అసిస్టెంట్ ఇన్చార్జి కామత్ రామచంద్రరావు,పంచాయతీ కార్యదర్శులు,ఎనర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ల,డ్వాక్రా యానిమేటర్లు పాల్గొన్నారు.