స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 27
పేదలకు నిస్వార్థంగా వైద్య సేవలందించాలనే లక్ష్యం తో డా” బ్రహ్మానందరెడ్డి 10 రూపాయల క్లినిక్ ను డా” బ్రహ్మానందరెడ్డి ఆసుపత్రి పేరు తో ప్రారంభించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు లో కుమ్మరామం కట్ట సెంటర్ లో ఈ క్లినిక్ ను నిర్వహిస్తున్నారు.
ఒకప్పుడు డాక్టర్ కన్షల్టేషన్ ఫీజు 100 రూపాయలుండేది.రాను రాను 100 కాస్త 500 కి చేరింది.ఇక కార్పోరేట్ ఆసుపత్రిలో 1000 చెల్లించుకోక తప్పదు.కన్సల్టేషన్ ఫీజు,టెస్టులు,మందులు అన్నీ కలిపి సామాన్యులకు తడిసి మోపెడు అవుతుంది.పోనీ సర్కారు దవాఖానకు వెళ్దామంటే అక్కడ సదుపాయాలు,చికిత్స సరిగా ఉంటాయో ఉండవో అన్న సందేహాలు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడో ఒకచోట పేదల కోసం నిస్వార్థంగా పనిచేసే వైద్యులు లేకపోలేదు.. ఆ కోవలోకే వస్తారు గిద్దలూరు నియోజకవర్గంలో ని పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన డా” బ్రహ్మానందరెడ్డి.
10 రూపాయల డాక్టర్ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రవేటు క్లినిక్ లలో ఎంత చిన్న క్లినిక్ అయినా కన్సల్టేషన్ ఫీజు 100- 300 రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు.ఉన్న డబ్బులన్నీ కన్సల్టేషన్ ఫీజు కే చెల్లించడంతో ఇక మందుల కనుగోలుకు పేదల దగ్గర డబ్బులు ఉండట్లేదన్నారు.అందుకే కేవలం 10 రూపాయల కే వైద్య సేవలు అందించడం ద్వారా తమ వద్ద ఉన్న డబ్బు తో వారు మందులు కోనుగోలు చేయగలరని అన్నారు.
పుట్టి పెరిగిన ప్రాంతంలో కేవలం 10 రూపాయల కన్సల్టేషన్ ఫీజుతో వైద్య సేవలు అందించడం,వైద్య పరీక్షల కు సంబంధించి ల్యాబ్ సదుపాయాలు కూడా తక్కువ ఫీజు కు అందించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.