కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామానికి చెందిన మాదిగ దళిత ఎస్సి కాలనీ అధ్యక్షుడు రవీందర్ గ్రామస్థుడు సురేష్ ఆదివారం ఆసిఫాబాద్ జడ్పిటిసీ,బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అరిగెల నాగేశ్వరరావుకి వారు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు ఫలాలు సరిగ్గా అందని ద్రాక్షగా ఉన్నాయని అన్నారు.ప్రభుత్వం అందించే నిరుపేదలకు గృహలక్ష్మీ పథకం ద్వారా ఇవ్వబడే మూడు లక్షలు అందేలా మరియు దళిత బంధు వచ్చేలా సహకరించలని తమపై దయ చూపాలని కోరుచున్నామని వేడుకున్నారు.దళిత మాదిగ కులానికి చెందిన వారిని ఆదు కోవాలని వారు పేర్కొన్నారు.అనంతరం సానుకూలంగా ప్రేమపూర్వకంగా పలకరించిన జడ్పిటిసి,బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అరిగేల నాగేశ్వరావు మాట్లాడుతూ దళితులకు, నిరుపేదలందరికి గృహలక్ష్మీ, దళితబంధు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఏలాంటి ఆపద వచ్చిన ఏ సమస్యలు ఉన్నా కాని తను ముందుండి అండగా ప్రజలకు ఉంటానని ఎల్లవేళలా నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు వచ్చేలా అందుబాటులో దగ్గరుండి చూస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అరిగేల నాగేశ్వరావు,ఎంపీపీ మల్లికార్జున యాదవ్,ఎస్సి ఎస్టీ అట్రాసిటీ జిల్లా కమిటీ మెంబర్ గోపాల్నాయక్ తదితరులు పాల్గొన్నారు.