వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గీరిగిట్ పల్లి తండా గిరిజనులకు భూమి పట్టాలు ఇవ్వాలని మంత్రి సబితా రెడ్డికి వినతి పత్రం సమర్పిస్తున్న దృశ్యం
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి మంత్రి సబితా రెడ్డికి వినతిపత్రం
వికారాబాద్: గిరిగిట్ట్ పల్లి తండాలో కతకొన్ని సంవత్సరాలుగా భూమి సాగు చేసుకుంటున్న గిరిజనులకు పోడు భూములపై పట్టాలివ్వాలని కోరుతూ *మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్. రామచంద్ర రెడ్డి* నేతృత్వంలో శనివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. వికారాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర రెడ్డి ,దారురు మాజీ పిఏ సీ ఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి ,*వడ్లనందు ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు వి.నందు* మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగులపల్లి రమేష్ కౌన్సిలర్ చందర్ నాయక్ కొండాపూర్ కలాన్ సర్పంచ్ పరమేష్ ఎబ్బనూర్ రాజేందర్రెడ్డి తదితరులు కలిసి గిరిగేటి పల్లి తండావాసులకు పట్టాలివ్వాళని కోరారు ఈ విషయమే స్పందించిన మంత్రి సబితా రెడ్డి అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని ఈ విషయమే పరిశీలించి సంబంధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆదేశించారు.