స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 25
రాష్ట్ర శాసనసభలో రాష్ట్రంలో ఉన్న నాలుగు జిల్లాలలోని వాల్మీకుల్ని బోయలను ఎస్టీలుగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపడం సరైన చర్య కాదని వాల్మీకి సేవా సమితి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రాచర్ల మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధికార ప్రతినిధి నల్లబోతుల శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఉన్న వాల్మీకి బోయలను ఎస్టీలుగా చేర్చడం కోసం సత్యపాల్ కమిటీని నియమించి తద్వారా చట్టబద్ధంగా శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపడం జరిగిందని ,కానీ ఆనాటి రాష్ట్ర పరిస్థితులు కేంద్రంతో రాష్ట్ర సంబంధాల మూలంగా అది పక్కన పెట్టడం జరిగిందని ఈనాడు జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం రాజకీయ దురుద్దేశంతో 8 జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకి బోయలను కాకుండా కేవలం కడప, కర్నూలు, అనంతపురం ,చిత్తూరు జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకి బోయిన మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి నివేదిక పంపడం మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకి బోయలను వంచన చేయడమేనని, ఇందులో కూడా చాలా లొసుగులు ఉన్నాయని .కేవలం ఎన్నికల ముందు వాల్మీకుల్ని మోసం చేయడంలో భాగమేనని పేర్కొన్నారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కటికె యోగానంద్ మాట్లాడుతూ కాపుల్ని బీసీల్లో చేర్చమంటే అది శాసనసభ పరిధి కాదు అని చెప్పి అది కేంద్రం పరిధి అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి మరి దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చమని, వాల్మీకి బోయలను బీసీ లోంచి ఎస్టిలో చేర్చమని శాసనసభ తీర్మానం కేంద్రం కు పంపడం లో ఎన్నికల్లో ఓట్ల కోసం కుట్ర అని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వాల్మీకి సేవా సమితి జిల్లా కన్వీనర్ శ్రీమతి నల్లబోతుల రమాదేవి ,జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి యామా సంజయ్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి కత్తి అన్నోజి రావు ,తెలుగు యువత మండల అధ్యక్షుడు సొంటమ్ కళ్యాణ్ రెడ్డి, నల్లబోతుల తేజ, షైక్ మున్నా , దేశబోయిన అశోక్, గొర్ల పవన్, షైక్ నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు.