వికారాబాద్ జిల్లాలో పనిచేసే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేసిన టియు డబ్ల్యూజె-ఐజేయు నాయకులు
వికారాబాద్ :
వికారాబాద్ జిల్లాలో పనిచేసే జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి గారికి టియుడబ్ల్యూజె-ఐజెయు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్, జిల్లా కోశాధికారి కే.రాఘవేందర్, నాయకులు పి.చుక్కయ్య, పాండు, ప్రమోద్, ఇనాయత్ అలీ, నరసింహారావు తదితరులు వినతిపత్రం అందజేశారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేశారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో కూడా పనిచేసే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనం కలెక్టర్ రాహుల్ శర్మ, డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.