జగనన్న గోరుముద్దలో మరో పౌష్టిక ఆహారం- ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 21, మహానంది:
జగనన్న గోరుముద్దలో మరో పౌష్టిక ఆహారం అని ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని అన్నారు.
మహానంది మండలం తమ్మడపల్లె గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల యందు ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని చేతులమీదుగా మంగళవారం పాఠశాలలో రాగి జావా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా జగనన్న గోరుముద్దలో భాగంగా విద్యార్థుల ఆరోగ్యం కోసం పోషకాలు అందించి వారిలో రక్తహీనత లోపాన్ని నివారించేందుకు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్యం కోసం సంవత్సరానికి సుమారు 86 కోట్ల రూపాయలతో పౌష్టిక ఆహారం బెల్లంతో కూడిన రాగి జావాను విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం హర్షనీయమని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్యను, పౌష్టిక ఆహారాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భవిష్యత్తులో మంచి ఆరోగ్యాన్ని ఉన్నత విద్యను పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జనార్దన్ శెట్టి, ఎంపీడీవో శివ నాగజ్యోతి, జెడ్పిటిసి కెవిఆర్ మహేశ్వర్ రెడ్డి, విద్యాశాఖ అధికారి రామసుబ్బయ్య, డిప్యూటీ తాసిల్దార్ నారాయణరెడ్డి, మహానంది దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.