నేడు మహానందిలో ఉగాది పంచాంగ శ్రవణం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు..
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 21, మహానంది:
ప్రముఖ శైవ క్షేత్రం మహానంది పుణ్యక్షేత్రంలో బుధవారం నాడు ఉగాది పండుగ పురస్కరించుకుని శుభకృత్ నామ తెలుగు నూతన సంవత్సర వేడుకలను ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి , పాలక మండలి చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా బుధవారం నాడు ఉదయం శ్రీ కామేశ్వరి దేవి మహానంది ఈశ్వరులకు ప్రత్యేక అభిషేక అర్చనలు నిర్వహించి ఉగాది పచ్చడి భక్తులకు పంపిణీ చేయబడుతుందన్నారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నవగ్రహ దిక్పాలక పూజలు చేసి పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. బుధవారం ఉదయం క్షేత్రానికి వచ్చే లక్షలాది కన్నడ భక్తుల కొరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులచే గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆలయ ఈవో మాట్లాడుతూ ఉగాది పండుగకు క్షేత్రానికి వచ్చే కన్నడ భక్తుల కోసం ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు, దాతల సహకారంతో భక్తులకు మజ్జిగ, త్రాగునీరు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లుగా ఈఓ తెలిపారు.