కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్, కార్యదర్శి అధ్యక్షతన ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ప్రతి ఒక్కరూ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం వంద రోజుల పనికి వెళ్లాలని లేకపోతే తమకు ఉన్న ఉపాధిహామీ పథకం జాబు కార్డులు రద్దేయ్యే పరిస్థితిలు ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా ఎస్సి వాళ్ళు జాబు కార్డులు కలిగిన కూలీలు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పని దినాలను చేసి వుంటేనే తమకు ఉన్న జాబు కార్డులు ఉపయోగ పడతాయని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ప్రతి యొక్క నిరుపేదల పెన్నిదని అన్నారు.గ్రామస్థులందరూ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ వందరోజుల పనిని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుర్గం కమలాకర్ పంచాయతీ సెక్రటరీ తన్నీరు వెంకటేష్,జాడి రాజ్ కుమార్ ఉపాధి కూలీలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.