ప్రతిఒక్కరు ప్రథమ చికిత్సపై అవగాహన పెంచుకోవాలి
– సిపిఆర్ ఫై ఫారెస్ట్ సిబ్బందికి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అవగాహన
– డిఎఫ్ఓ వినీత్ కుమార్
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 18, మహానంది:
ప్రథమ చికిత్స, సిపిఆర్ (హృదయ శ్వాస కోశ పునర్జీవ చర్య) తదితర అంశాలపై మహానందిలో ఫారెస్ట్ సిబ్బందికి 2రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని జిల్లా అటవీశాఖ జిల్లా అధికారి వినీత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మహనందిలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని శిక్షణ పొందిన అటవీ సిబ్బందికి సర్టిఫికెట్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్, రెడ్ క్రాస్ రాష్ట్ర ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ డా.చంద్రశేఖర్, కోఆర్డినేటర్ రాజునాయక్, డా.శివ, రేంజర్లు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతి స్విమ్స్ వైద్యశాలకు చెందిన గుండెకు సంబంధించిన డాక్టర్ చంద్రశేఖర్ ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తూ సాధారణంగా ఈ విధానాన్ని కార్డియా పల్మినరీ రీసెర్చ్ స్టేషన్ గా వైద్యుల పరిభాషలో వాడుతూ ఉంటారు అని తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికత్సలో భాగంగా షుగరు, బిపి ఉన్నవారికి అనుకోకుండా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వారు స్పృహ కోల్పోయినప్పుడు అటువంటి సమయాల్లో హృదయ శ్వాసకోశ పునర్జీవన చర్య (సిపి ఆర్) చేయటంవల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గుండెపోటు వచ్చిన సమయంలో గుండె భాగం నందు దాదాపు 100 సార్లు చేతులతో ఒత్తిడి చేయడం వల్ల 90 శాతం ప్రాణాలు కాపాడవచ్చన్నారు. తర్వాత ఆస్పిరిన్ టాబ్లెట్ ఇవ్వడం వల్ల కొంత సమయం ఉంటుందని వెంటనే సమీపంలోని వైద్యశాలకు తరలిస్తే ప్రాణాలు కాపాడవచ్చని ఫారెస్ట్ సిబ్బందికి సూచించారు.
సాధారణంగా ఫారెస్టు అధికారులు కానీ సిబ్బంది కానీ అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సందర్భంలో గుండెపోటు వచ్చిన సందర్భంలో గుర్తించి సిపిఆర్ విధానాన్ని పాటిస్తే తోటి వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రేంజర్ శివకుమార్, డిఆర్ఓ సుబ్బయ్య, గార్డ్ ప్రతాప్, శ్రీనివాసులు, నంద్యాల, డోన్ రుద్రవరం తదితర ప్రాంతాలకు చెందిన ఫారెస్ట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.