రైతులు ఆధునిక వ్యవసాయంపై దృష్టి సారించాలి
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 18, మహానంది:
రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ పంటలను పండించుకోవాలని డాక్టర్ సుబ్రహ్మణ్యం అన్నారు.మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని లాల్ స్వామి మకానం నందు రైతు అవగాహన సదస్సు కార్యక్రమంను వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు.అనంత రాజుపేట విశ్వవిద్యాలయం ఉద్యాన విద్యార్థులు విద్యార్థులు నిర్వహించిన వ్యవసాయ సాంకేతిక ప్రదర్శన- రైతు సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉద్యాన పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ రైతులకు వ్యవసాయంలో మేళకువలు,సేంద్రియ వ్యవసాయ విధానం, పురుగు మందుల వాడకం, సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు, రైతులకు అనేక విషయాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి,ప్రొఫెసర్ డాక్టర్ రూత్, హార్టికల్చర్ ఆఫీసర్ ఎం. శ్రీధర్,సీనియర్ సైంటిస్ట్ ఠాగూర్ నాయక్ , గజ్జ పెద్దపకీరయ్య, గ్రామ రైతులు,రావేప్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.