*రబి సీజన్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అన్ని ప్రణాళిక సిద్ధం చేయండి.*
— కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర..
_అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర వారి ఆదేశాల మేరకు శనివారం ఆలమూరు మండలంలోని పలు గ్రామాలలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలను జిల్లా పౌరసరఫరాల మేనేజర్ తులసి తమ జిల్లా స్థాయి అధికార సిబ్బందితో కలిసి సందర్శించి రబి పంట కాలానికి సంబంధించిన జరిగే ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలు కావస్తున్న నేపథ్యంలో రైతు బరోసా కేంద్రాలలో పని చేయాల్సిన ధాన్యం కొనుగోలు సిబ్బందిని,పరికరాలను, రిజిస్టర్ లను తనిఖీ చేసి,ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో వచ్చిన సమస్యలను అడిగి తెలుసుకున్నారని ఈ రబి సీజన్ కు సంబందించిన కొనుగోలులలో అవసరమయ్యే హమాలిలు,రవాణా,గోని సంచులకు ముందస్తు ప్రణాళికలు తయారు చేయవలసిందిగా జిల్లా స్థాయి అధికారులు తెలియజేసినట్లు ఏడి కాకి నాగేశ్వరరావు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరా అధికారులు,జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్,మండల వ్యవసాయధికారిని,గ్రామ వ్యవసాయ సహాయకులు,సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు._