సి పి ఆర్ ఫై ఫారెస్ట్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 17, మహానంది:
మహానందిలోని సి పి ఆర్ (హృదయ శ్వాస కోశ పునర్జీవ చర్య) పై ఫారెస్ట్ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తిరుపతి స్విమ్స్ వైద్యశాలకు చెందిన గుండెకు సంబంధించిన డాక్టర్ చంద్రశేఖర్ ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తూ సాధారణంగా ఈ విధానాన్ని కార్డియా పల్మినరీ రీసెర్చ్ స్టేషన్ గా వైద్యుల పరి భాషలో వాడుతూ ఉంటారు అని తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికత్స లో భాగంగా షుగరు మరియు బిపి ఉన్నవారికి అనుకోకుండా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వారు స్పృహ కోల్పోయినప్పుడు అటువంటి సమయాల్లో హృదయ శ్వాసకోశ పునర్జీవన చర్య( సి పి ఆర్) చేయటంవల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. గుండెపోటు వచ్చిన సమయంలో గుండె భాగం నందు దాదాపు 100 సార్లు చేతులతో ఒత్తిడి చేయడం వల్ల 90 శాతం ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు. తర్వాత ఆస్పిరిన్ టాబ్లెట్ ఇవ్వడం వల్ల కొంత సమయం ఉంటుందని వెంటనే సమీపంలోని వైద్యశాలకు తరలిస్తే ప్రాణాలు కాపాడవచ్చు అని ఫారెస్ట్ సిబ్బందికి సూచించారు. సాధారణంగా ఫారెస్టు అధికారులు కానీ సిబ్బంది కానీ అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సందర్భంలో గుండెపోటు వచ్చిన సందర్భంలో గుర్తించి సి పి ఆర్ విధానాన్ని పాటిస్తే తోటి వారి ప్రాణాలను కాపాడవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో రేంజర్ శివకుమార్, డిఆర్ఓ సుబ్బయ్య,, గార్డ్ ప్రతాప్, శ్రీనివాసులు మరియు నంద్యాల, డోన్ రుద్రవరం తదితర ప్రాంతాలకు చెందిన ఫారెస్ట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. శనివారం రెండవ రోజు కూడా మరో బ్యాచ్ కి మహానందిలో ని ఫారెస్ట్ కార్యాలయంలో అవగాహన కల్పించనున్నారు.