విష్ణు నందీశ్వర ఆలయంలో హుండీ లెక్కింపు
పెరిగిన స్వామి వారి ఆదాయం
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 15, మహానంది:
మహానంది మండల పరిధిలోని కృష్ణ నంది క్షేత్రంలో వెలసిన శ్రీ విష్ణు నందీశ్వర స్వామి వారి ఆలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామాంజనేయ శర్మ ఆధ్వర్యంలో హుండి లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం ఆలయాల ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో భక్తులు గత ఏడాది శివరాత్రి నుంచి ఇప్పటివరకు కానుకలుగా సమర్పించిన మొత్తం రూ 96.603 రూపాయలు హుండీ ద్వారా వచ్చినట్లు ఈవో తెలిపారు.అయితే గత ఏడాది రూ 54.294 రూపాయలు రాగా ప్రస్తుత ఏడాది గతంలో కంటే సుమారు 43 వేల ఆదాయం పెరిగినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్లు తిరుపం రెడ్డి,ప్రతాప్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పల్లె నాగమణి,స్థానికులు కృష్ణవేణి,సోమశేఖర్ రెడ్డి, ఆదిలక్ష్మి రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి, అర్చకులు మనోహర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.