మలుపులు వద్ద ఏపుగా పిచ్చి చెట్లు…మృత్యువుకు దారి
పట్టించుకోని అధికారులు
గాయాలపాలైన అనేకమంది ద్విచక్ర వాహనా దారులు
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 15, మహానంది:
మండల పరిధిలోని వివిధ గ్రామాలకు వెళ్లే రహదారులన్నీ అతి ప్రమాదకరమైన మూల మలుపులకు నిలయాలు. అనేక మంది మంది తీవ్ర గాయాలపాలైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఆ రోడ్లను కంపచెట్లు, ఏపుగా పెరిగిన పిచ్చి చెట్లు చుట్టేశాయి.ప్రమాదాలకు నిలయంగా మార్చేసాయి.మహానంది మండల పరిధిలోని గాజులపల్లె- గిద్దలూరు జాతీయ రహదారిపై ఏపుగా పెరిగిన పిచ్చి చెట్లు వల్ల ఎదురెదురుగా వచ్చే వాహానాలు సరిగ్గా కనబడకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని వాహనదారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మూలమలుపు వద్ద కంపచెట్లు, ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు రోడ్లను చుట్టేశాయి. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఈ రహదారుల్లో రోజు ప్రముఖుల ప్రయాణం ఈ రోడ్ల మీదుగా నిత్యం ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏదో ఒక పని పై ప్రయాణం చేస్తూనే వుంటారు. అయినా వారికి రోడ్లను చుట్టేసిన కంపచెట్లు, ప్రమాదకరంగా ఉన్న మూలమలుపులు కనిపించకపోవడం శోచనీయం. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.