*ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ఆత్మీ సభన*
*నా సంపాదనలో 75 శాతం ప్రజలకే ఖర్చు పెడుతున్నా: ఎమ్మెల్యే చెవిరెడ్డి*
చంద్రగిరి
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి
వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేడు చంద్రగిరి నియోజకవర్గంలో ఆత్మీ సభను నిర్వహించారు . భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో చేపట్టిన పనులు, చేసిన అభివృద్ధి పనులను గురించి ఆయన స్వయంగా ప్రజలకు తెలియజేశారు
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ భారీ సభకోసం నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి ప్రజలను రప్పించి తాను చేసిన అభివృద్ధి పనులను గురించి వివరించనున్నారు
రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ జరగని అభివృద్ధి తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. తన సంపాదనలో 75 శాతం ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నానని వ్యాఖ్యానించారు. అలాంటి తనపైనే విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. చంద్రగిరి సమీపంలోని తొండవాడ వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఎంపీలు మిథున్ రెడ్డి, రెడ్డెప్ప, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ జరగని అభివృద్ధి చంద్రగిరిలో జరిగిందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు తొలి నుంచి అండగా ఉన్నానని.. రూ. 430 కోట్లతో చంద్రగిరిని అభివృద్ధి చేశానని చెప్పారు. తన సంపాదనలో 75 శాతం ప్రజలకే ఖర్చు పెడతానని.. అయినా, తానెక్కడా పబ్లిసిటీ చేసుకోలేదన్నారు. ప్రతి పంచాయితీకి రూ. 2.50 కోట్లకు తక్కువ కాకుండా నిధులు ఇచ్చానని తెలిపారు. తనపై చేసిన విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తానని వ్యాఖ్యానించారు ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన మేలును ప్రజలంతా గుర్తించాలన్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి పథకాలు రద్దు చేస్తానని నారా లోకేష్ చెప్పడం దారుణమైన విషయమన్నారు. కరోనా సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి చేసిన సేవలు అమోఘమన్నారు. రాష్ట్ర ఇప్పటికీ ప్రభుత్వ పథకాలు టీడీపీ నాయకులకు అందుతున్నాయని వెల్లడించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేసిన భారీ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు