పుస్తక జ్ఞానాన్ని మించినది ఏదీ లేదు-
ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి తండ్రి వెంకటపతి రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 10, మహానంది:
జ్ఞానాన్ని మించినది ఏదీ లేదని ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి తండ్రి కసిరెడ్డి వెంకటపతి రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని కంచర్ల ఈశ్వరయ్య మనమరాలి పెళ్లి వేడుకలకు శుక్రవారం వెంకటపతి రెడ్డితో పాటు ఆయన సతీమణి సుబ్బలక్ష్మమ్మ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయనను కలిసిన పాత్రికేయులతో మాట్లాడుతూ తాను బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామంలో వివాహం చేసుకున్నట్లు, నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేశానని గత సుతులను గుర్తు చేసుకున్నారు.గ్లోరీ ఆఫ్ శ్రీకృష్ణ అనే గ్రంధాన్ని 14 భాషలలో అనువాదం చేసే కార్యక్రమంలో తాను తెలుగు భాష లోకి అనువాదం చేసినట్లు పేర్కొన్నారు.అంతేకాక తాను మొట్ట మొదటగా జ్ఞానబిందు అనే పుస్తకాన్ని రచించినట్లు, దానితో పాటు మరో పంతొమ్మిది ఆధ్యాత్మిక పుస్తకాలను రచించినట్లు పేర్కొన్నారు.తాను కడప జిల్లా పులివెందుల సమీపంలోని గ్రామాల్లో ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనకు శిష్యుడని 7 ,8 ,9 తరగతుల్లో ఆయనకు విద్య బోధించినట్లు తెలిపారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తనను ఎంతో గౌరవంగా గౌరవించి సన్మానించినట్లు తెలిపారు .నేటి మేధావి వర్గం ఓట్ల కు అమ్ముడు పోతుండటం ఎంతో వేదన కలిగిస్తుందన్నారు.ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు ఎందరో ఓట్లను అమ్ము కుంటున్నారన్న విషయాలు ఎంతో వేదన కలిగిస్తుందని తెలిపారు.తన కుమారుడు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు చదువుకున్న మహానంది మండలం బుక్కాపురం మాజీ సర్పంచ్ గడ్డం హరిప్రసాద్ కుటుంబంతో కలిసి వారి బాల్యం విషయాలను తెలుసుకున్నారు.ఆయన రాసిన ఇది వేమన పద్యం అనే పుస్తకాన్ని మహానంది దేవస్థానం మాజీ చైర్మన్ కంచర్ల సురేష్ రెడ్డికి అందజేశారు. ఆయనతోపాటు న్యాయవాది సత్యనారాయణ, శివయ్య చౌదరి ,గడ్డం నాగపుల్లయ్య ,పలువురు కమ్మ సంఘం నాయకులు వెంకటపతి రెడ్డితో కలిసి ముచ్చటించారు.