నులి పురుగు నివారణ దినోత్సవం పై అవగాహన కార్యక్రమం జయప్రదం చేయండి
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 10, మహానంది:
ఆరోగ్యవంతమైన పిల్లల కోసం 14 మార్చి 2023 నా జరుగు నులిపురుగు నివారణ దినం కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మహానంది మండల అధికారులు ఎంపీడీవో శివనాగజ్యోతి, ఎంఈఓ రామసుబ్బయ్య, వైద్యాధికారులు రూపేంద్ర నాథ్ రెడ్డి, డాక్టర్ వెంకటరెడ్డి కోరారు. మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూలు ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తో శుక్రవారం తిమ్మాపురం ఆరోగ్య కేంద్రం నందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 14 మార్చి 2023న జరుగు నివారణ కార్యక్రమంలో ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాలు లోపు పిల్లలు ప్రతి ఒక్కరికి ఆల్బెండజోల్ 400 ఎంజి మాత్రలు మింగించవలసిందిగా కోరుతూ వారి స్కూల్ పిల్లల ఆధారంగా వారికి ఆల్బెండజోల్ మాత్రమే పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది విజయ రెడ్డి, హుస్సేన్ రెడ్డి పాల్గొన్నారు.