టెండర్ల ద్వారా మహానంది దేవస్థానానికి కోటి 45 లక్షల ఆదాయం..
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 10, మహానంది:
ప్రముఖ శైవ క్షేత్రం మహానంది పుణ్యక్షేత్రంలో వివిధ రకాల బహిరంగ వేళాలు శుక్రవారం నాడు క్షేత్ర పరిధిలోని పోచ బ్రహ్మానంద రెడ్డి వసతి భవనంలో ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ టెండర్లలో భాగంగా ఒక సంవత్సరం కాల పరిమితి కి కొబ్బరికాయలు పూలు అభిషేక పూజా సామాగ్రి విక్రయించుకొను లైసెన్స్ హక్కులకు బహిరంగ వేలం ద్వారా భూమ హరినాథ్ బాబు మహానంది వాస్తవ్యులు 44 లక్షలకు హెచ్చు పాట పాడియున్నారు. నవగ్రహ మండపం వద్ద దీపారాధన సామాగ్రి విక్రయించు లైసెన్స్ హక్కులకు టి హరీష్ మహానంది వాస్తవ్యులు టెండర్ ద్వారా 60,50,116 రూపాయలకు దక్కించుకున్నారు. సెల్ ఫోన్స్ లగేజ్ భద్రపరచు లైసెన్స్ హక్కులకు శ్రీమతి ఎం ఉమాదేవి మహానంది వారు సీల్డ్ టెండర్ ద్వారా 18,18000 లకు దక్కించుకున్నారు. పచ్చి కొబ్బరి చిప్పలు ప్రోగు చేసుకొని లైసెన్స్ హక్కులకు సీల్డ్ టెండర్ ద్వారా 22,52,199 రూపాయలకు రాజు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ ఈ టెండర్ల ద్వారా దేవస్థానానికి ఒక కోటి 45 లక్షల 19 వేల315 రూపాయలు ఆదాయం వచ్చినట్లుగా తెలిపారు. అదేవిధంగా వాహన పూజలు జరిపించు లైసెన్స్ హక్కునకు సరైన పాట రానందున వాయిదా వేయడమైనది మరియు పీచు కొబ్బరికాయలు సరఫరా చేయుటకు సరైన ధరావత్తుధారు లేకపోవడం వల్ల వాయిదా వేయడమే అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఓ మధు, ధర్మకర్త మండలి సభ్యులు, గ్రూప్ టెంపుల్స్ ఈఓ వేణుమాధవ్ రెడ్డి, టెండర్ దారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.