*చిన్నారి వైద్యానికి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం*
— జొన్నాడ శ్రీ విఘ్నేశ్వర లారీ ట్రాన్స్పోర్ట్ వారి సహకారంతో…
— కుటుంబం ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు..
_మండల కేంద్రమైన ఆలమూరు గ్రామంలోని గణేష్ కాలనీకి చెందిన ముద్రగడ్డ యేసు రాజు కుమార్తె అరుణ కుమారి (9) ఇటీవల గాలిబ్లాడర్లో, ప్రేగులో రాళ్లు చేరుకుని ఆనారోగ్యానికి గురిఅవ్వడంతో బాలికను వైద్యం కోసం హైదరాబాదుకు తరలించగా డాక్టర్లు చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని దీని నిమిత్తం రూ.4.50 లక్షలు వరకు ఖర్చు అవుతుందని వారు తెలియజేశారు.బాలిక తండ్రి ఏసు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పలువురు వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు.విషయం తెలుసుకున్న జొన్నాడ గ్రామ శ్రీ విఘ్నేశ్వర లారీ ట్రాన్స్పోర్ట్ వారి సహకారంతో తక్షణ ఆర్థిక సహాయముగా శుక్రవారం 10000/-రూపాయలు వారి కుటుంబ సభ్యులకు గ్రామ ఉప సర్పంచ్ నాండ్ర నాగమోహన్ రెడ్డి,సొసైటీ అధ్యక్షులు తాడి మెహర్ ఆదిత్య రెడ్డి చేతులమీదుగా అందజేసి వారి కుటుంబాన్ని ఓదార్చారు.నిరుపేదలైన ఆ బాధిత కుటుంబం సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఆ చిన్నారి వైద్యానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని గణేష్ కొలనీ వాసులు కోరుతూ సాయం చేస్తున్న దాతలను అభినందించారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గొలుగూరి బుచ్చిరెడ్డి,కట్టా సత్య ప్రసాద్,తాడి శ్యాంసుందర్ రెడ్డి,తమలంపూడి లక్ష్మీనారాయణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు._