*దారిదోపిడి కేసులో ఆరుగురు ముద్దాయిలకు జైలు శిక్ష.*
_అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు దారి దోపిడిలకి సంభందించిన కేసుల్లో ఆరుగురు వేరు వేరు ముద్దాయిలకు గురువారం జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జ్ డాక్టర్ దీపా దైవకృప ఒక్కొక్కరికి రెండు సంవత్సరాల ఆరు నెలలు కట్టిన కారాగార శిక్ష విధించినట్లు ఎస్సై ఎస్.శివప్రసాద్ తెలియజేశారు. ముద్దాయిల వివరాలు ప్రకారం కపిలేశ్వపురం మండలం తాతపూడి గ్రామానికి చెందిన కొండే నవీన్ కుమార్, అయినవిల్లి మండలం నేదినూరు గ్రామానికి చెందిన డేగల సుధీర్ కుమార్, కాకినాడ సూర్యరావుపేటకు చెందిన శ్రీమన్నారాయణ, ఆలమూరు మండలం పెనికేరు గ్రామానికి చెందిన గుడాల వీర వెంకట సత్యనారాయణ, అయినవిల్లి మండలం నేదినూరు గ్రామానికి చెందిన బూలా శ్రీను తండ్రి భీమారావు, అయినవిల్లి మండలం నేదినూరు గ్రామానికి చెందిన జంగా బాలాజీ అను వారిని సదరు రెండు కేసులలో అరెస్ట్ చేసి, ముద్దాయిలని కోర్టులో హాజరుపరచగా జూనియర్ సివిల్ కోర్టు జడ్జి డాక్టర్ కె.దీపా దైవకృప వాదనలు విన్న తర్వాత ఆరుగురు ముద్దాయిలపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి రెండు సంవత్సరాల ఆరు నెలలు కఠిన కారాగార శిక్షతో పాటుగా 2000 రూపాయలు అపరాధ రుసుమును విధించినట్లు, ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున వాదనలు పిపి శ్రీరాములు వినిపించగా అందుకు కోర్ట్ హెడ్ కానిస్టేబుల్ జి.ప్రభాకర్రావు సహకారం అందించినట్లు ఎస్ఐ ఎస్.శివప్రసాద్ తెలియజేశారు._