జిల్లాలో మద్యం దుకాణాలు బంద్

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల‌ నేపథ్యంలో మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ చేయడం జరిగింది. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్రమంలో ఆ మూడు జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలను మార్చి 11 సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 13 సాయంత్రం 4 గంటల వరకు మూసేవేసినట్లు ఎక్సైజ్‌ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా జోగుళాంబ గద్వాల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 వరకు మూసివేయడం జరిగింది. నిబంధనలు అతిక్రమించిన వైన్స్‌లపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఆబ్కారీ శాఖ అధికారులు హెచ్చరించారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!