విద్యార్థుల చదువులో విద్యా నైపుణ్యం మెరుగుపడాలి-డీఈవో అనురాధ
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 04, మహానంది:
విద్యార్థుల చదువులో విద్యా నైపుణ్యం మెరుగుపడాలని డీఈవో అనురాధ అన్నారు. శనివారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు బసాపురం మండల పరిషత్ పాఠశాలలను డిఇఓ అనురాధ ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను, వారి చదువుల నైపుణ్యములను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆరవ తరగతి విద్యార్థులను వారి చదువుల నైపుణ్యం పరిశీలించగా , విద్యార్థుల చదువులు మెరుగుగా లేనందున పాఠశాల ఉపాధ్యాయులను హెచ్చరించడం జరిగింది. విద్యార్థులు చదువులో మెరుగుగా ఉండేందుకు ప్రత్యేక చర్యలు, ప్రత్యేక తరగతులు తీసుకొని ఉత్తమ విద్యార్థులు గా తీర్చిదిద్దాలని, నేటి బాలలే రేపటి పౌరులని ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు వారి పరీక్షలలో 100% ఉత్తీర్ణత వచ్చే విధంగా ఉపాధ్యాయులు పిల్లలను తీర్చిదిద్దాలని సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పాఠశాలలో విద్యార్థుల రిజిస్టర్లు, మరియు పాఠశాల రిజిస్టర్లు పరిశీలించడం, పాఠశాలలో నిర్వహించే మధ్యాహ్న భోజనం తనిఖీ చేసి స్వయంగా భోజనం చేసి చూడడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రామసుబ్బయ్య, రామసుబ్బయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రమణమ్మ, శ్రీనివాసులు,పాఠశాల చైర్మన్ షేక్ తగ్దీర్ పాల్గొన్నారు.