వాంకిడిలో ఇసుక దోపిడీ అక్రమ రవాణాను అడ్డుకోవాలి డివైఎఫ్ఐ,కేవీపీఎస్
స్టూడియో10టీవీ ప్రతినిధి కృష్ణపల్లిసురేష్ మార్చ్ 4
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని కోరుతూ శనివారం డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ ల ఆధ్వర్యంలో వాంకిడి ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.వాంకిడి మండలంలోని ఖన్నర్ గాం, చిక్కిలి వాంకిడి, భీంపూర్, బుదల్ ఘాట్ గ్రామాల వాగుల నుంచి విచ్చలవిడిగా ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయనికి గండి కొడుతున్నారని. రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవరిస్తున్నారని అన్నారు. వాగుల నుంచి ఇసుక తీయడం వలన భూగర్భ జలాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని, వాటిని కాపాడాలంటే ఇసుక అక్రమ దోపిడీ రవాణా ఆపాలని కోరారు. ఈ ఇసుక రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టాలని పేర్కొన్నారు.