రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి- మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 04, మహానంది:
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి పేర్కొన్నారు.శనివారం మహానంది ఫారం సమీపంలోని ఆచార ఎన్జీ రంగ వ్యవసాయ కళాశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిపాలన కొనసాగుతుంది అన్నారు.పట్టా బద్రులు,ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి రాష్ట్ర అభివృద్ధి కృషి చేయాలన్నారు.సీఎం జగన్ కల్లబొల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుతున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదన్నారు.గత నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యోగులకు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని ఎద్దేవ చేశారు.అప్రకటిట ఎమర్జెన్సీలో అరాచక పాలన దౌర్జన్యం,అవినీతిలో రాష్ట్రం ముందుందన్నారు.వచ్చే ఎన్నికల్లో టిడిపి నూటికి నూరు శాతం విజయం సాధిస్తుందన్నారు. మూడు రాజధాని వల్ల రాయలసీమకు ఒరిగిందేమీ లేదన్నారు.రాష్ట్రంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందలేని దయనీయ పరిస్థితి నెలకొంది అన్నారు .ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి రాబోయే ఎన్నికలలో రాష్ట్ర అభివృద్ధి కోసం టిడిపి పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. అదేవిధంగా మహానంది మండలంలోని తహసిల్దార్ కార్యాలయం సచివాలయంలోని పట్టభద్రులు మరియు అధికారులకు కరపత్రాలను ఇచ్చి ప్రతి ఒక్కరూ ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు టిడిపి వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.