*చిన్నారి వైద్యానికి దాతలు ఆర్థిక సహాయం*
— నిరుపేదలైన ఆ బాధిత కుటుంబం సహాయం కోసం ఎదురుచూస్తున్నారు..
_మండల కేంద్రమైన ఆలమూరులోని గణేష్ కాలనీకి చెందిన ముద్రగడ్డ యేసు రాజు కుమార్తె అరుణ కుమారి (9) ఇటీవల గాలిబ్లాడర్లో రాళ్లు చేరుకుని ఆనారోగ్యానికి గురిఅవ్వడంతో బాలికను వైద్యం కోసం హైదరాబాదుకు తరలించగా డాక్టర్లు చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని దీని నిమిత్తం రూ.4.50 లక్షలు వరకు ఖర్చు అవుతుందని వారు తెలియజేశారు.బాలిక తండ్రి ఏసు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పలువురు వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు.ఇంతలోనే విషయం తెలుసుకున్న గుమ్మిలేరు గ్రామ సర్పంచ్ గుణ్ణం రాంబాబు 5000/-రూ.పెదపళ్ల సొసైటీ అధ్యక్షులు నెక్కంటి వెంకటరాయుడు(బుజ్జి) 5000/-రూ.మొత్తం కలిపి తక్షణ ఆర్థిక సహాయముగా శనివారం 10000/-రూపాయలు అందజేసి వారి కుటుంబాన్ని ఓదార్చారు.నిరుపేదలైన ఆ బాధిత కుటుంబం సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఆ చిన్నారి వైద్యానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని గణేష్ కొలనీ వాసులు కోరుతూ సాయం చేస్తున్న దాతలను అభినందించారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు నాతి కుమార్ రాజా,నాయుడు ప్రసాద్, ర్యాలీ శ్రీనివాస్,దొడ్డివరపు సుబ్బారావు,షేక్ బాబ్జి,విజయ్ తదితరులు పాల్గొన్నారు._*