వికారాబాద్
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆదేశాల మేరకు కొడంగల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ సామల వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం దౌల్తాబాద్ మండలంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టారు. దౌల్తాబాద్ మండల కేంద్రంతో పాటు ,పలు గ్రామాల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించి గతంలో తెలుగుదేశం పార్టీ పేదల సంక్షేమం కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను గూర్చి వివరించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి పార్టీకి మద్దతునిచ్చి , పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ, నందారం కృష్ణారెడ్డి, మొగులప్ప, బుచ్చిరెడ్డి, మల్లేష్, వెంకటేష్, అంబదాస్, తదితరులు పాల్గొన్నారు.