కార్యకర్తలకు తోడు నీడగా నిలిచే ఏకైక పార్టీ BRS: వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
శుక్రవారం నాడు వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” గారు మోమిన్ పేట్ మండల పరిధిలోని రాళ్ళగుడుపల్లి గ్రామానికి చెందిన BRS పార్టీ కార్యకర్త మొల్లని రత్నయ్య కుటుంబ సభ్యులకు BRS పార్టీ ప్రమాద భీమా Rs.2,00,000/- (రూపాయలు రెండు లక్షల) చెక్కును ఎమ్మెల్యే గారు స్వయంగా కార్యకర్త ఇంటికి వెళ్లి అందించడం జరిగింది.
▪️ పార్టీకి సేవ చేసిన కార్యకర్త ఆకస్మికంగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి పార్టీ పరంగా భరోసనిస్తూ… ముఖ్యమంత్రి గౌరవ కెసిఆర్ గారు ప్రమాద భీమాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు