కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆదిలాబాద్ పార్లమెంట్ లోని సిర్పూర్ కాగజ్ నగర్ మున్సిపాలిటీ లో రాష్ట్ర పార్టీ చేపట్టిన ఇంటి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని 25,26,27 వార్డుల లో పార్లమెంట్ అధ్యక్షులు గుళ్ళపల్లి ఆనంద్ శుక్రవారం ప్రారంభించారు. ఇంటి ఇంటికి వెళ్తూ టిడిపి చేపట్టిన అభివృద్ధి గురించి కరపత్రాలు పంపిణి చేస్తూ , స్థానిక సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకుని, ప్రజల కు టిడిపి పార్టీ ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు పేదప్రజలకు చేసిన సేవలను ప్రజలకు తెలియజేస్తూ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గఆదేశంతో టిడిపి పార్టీ ఇంటి ఇంటి కి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించమని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడిపి బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడ్డ పార్టీ టిడిపి అని, టిడిపి ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి మారుమూల గ్రామాల్లో బీటీ రోడ్లు పట్టణాల్లో సిమెంట్ రోడ్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పాఠశాలలు విద్యా వైద్యం పేదవారికి అనేక సంక్షేమ పథకాలు తెచ్చి బడుగులకు బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాల కు చైతన్యం తెచ్చిన పార్టీ టిడిపి పార్టీ అని ఈ రోజున ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ప్రజల నుంచి మంచి స్పందన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజి కౌన్సిలర్ గుళ్ళపల్లి లావణ్య , చల్లురి శంకర్, సత్యనారాయణ, పుష్ప, సిహెచ్.ప్రభాకర్, వై. శ్రీనివాస్ రావు, సంజీవ్, నారాయణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.