పేదల కష్టాలు తీరాలంటే కేసీఆర్ ప్రధాని కావాలి
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వడ్ల నందు
వికారాబాద్, పేదల ఇండ్లలో వంట గ్యాస్ తీసేసి,కట్టెలతో వంట చేసుకునే రోజులు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయని,బీజేపీకి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వడ్ల నందు అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం అనంతరం వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులతో కలిసి విన్నతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వడ్ల నందు మాట్లాడుతూ… దేశాన్ని కేంద్రం ప్రభుత్వం అయ్యిన బీజేపీ ప్రభుత్వం దోచుకుతింటుందని,పేదోడి పై పెను భారాన్ని మోపుతూ రాక్షస ఆనందం పొందుతుందన్నారు.రూ.400 ఉన్న గ్యాస్ ధరలను కేంద్ర బీజేపీ ప్రభుతం రూ.1250 కు తీసుకువచ్చిందని విమర్శించారు.బిజెపి అధికారంలోకి రాక ముందు జాన్ ధన్ ఖాతాలు తెరిపించి ప్రతి పేదవారి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు.దేశాన్ని అంబానీ,ఆదాని లకు అప్పగించి వారి ఆస్తులను పెంచుతుంది తప్ప పేదవారికి ఎలాంటి లాభం లేదన్నారు.బీఆర్ఎస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుందని,పేదవారి బాధలు కేసీఆర్ నాయకత్వంలో తీరుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోట్ పల్లి ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు హన్మంత్ రెడ్డి,రామచంద్ర రెడ్డి,చిగుళ్లపల్లి రమేష్,అంజయ్య,బందేల్లి,విజయ్,పరమేష్ తదితరులు ఉన్నారు.