పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలి -మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు కోటకొండ భాష
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 03, మహానంది:
కేంద్ర బిజెపి ప్రభుత్వం గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర రూ.50, వాణిజ్య సిలెండర్ రూ.350 పెంచడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని, పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేసారు.మహానంది మండలం గాజులపల్లె గ్రామ పరిధిలోని గుండంపాడు రాస్తా సుందరయ్య నగర్ వద్ద మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు కోటకొండ భాష శుక్రవారం నిరసన తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు కోటకొండ భాష మాట్లాడుతూ వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెంచడంవల్ల ప్రజలు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్య ప్రజలు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ ధరలు రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు పెంచడం దారుణంమని మండిపడ్డారు. 3 సంవత్సరాల క్రితం వరకు రూ.417 ఉన్న డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర నేడు రూ.1155కు పెరిగింది. ప్రభుత్వం సబ్సిడీ జమలు రెండు సంవత్సరాల నుండి నిలిపివేసింది. ఇప్పటికే గృహ వినియోగానికి సబ్సిడీ క్రింద ఇచ్చే సిలెండర్ల సంఖ్య కుదించారు. ఇది పూర్తిగా పేద, మధ్యతరగతిపై దాడి తప్ప మరొకటి కాదు. వాణిజ్య సిలెండరు ఒక్కసారిగా రూ.350 పెంచడం వల్ల స్వీయ ఉపాధి పొందుతున్నవారు, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆర్ధిక మాంద్యం వలన చితికిపోతున్న స్వయం ఉపాధి మరింత దుర్భరస్థితికి చేరుకుంటుంది. ఉపాధి లేక, వేతనాలు చాలక ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం మూలిగే నక్కపై తాటి పండులా భారాలు మోపడం గర్హనీయం. మరోవైపు కార్పొరేట్లకు రాయితీలిచ్చి దేశాన్ని దోచిపెడుతున్నారు. వంట గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించి, సబ్సిడీని పునరుద్ధరించాలని సహ డిమాండ్ చేస్తున్నాం అని, పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్దిలేటి, రమణ, నాగార్జున, రసూల్ తదితరులు పాల్గొన్నారు.