ఇంపాక్ట్ బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ గా తిరుపతి పాటిల్.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలానికి చెందిన తిరుపతి పాటిల్ సాయిరే ఇంపాక్ట్ బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ గా ఎంపికయ్యారు.తిరుపతి పాటిల్ హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వ విద్యాలయంలో (సీనియర్ రీసెర్చ్ స్కాలర్ గా )ఆంగ్ల విభాగంలో డాక్టోరల్ ఫెల్లో గా పనిచేస్తున్నారు.తిరుపతి పాటిల్ సాయిరే ఒక మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి చెందినప్పటికి పరిశోధనా రంగంలో తన ప్రతిభను ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిభను ప్రదర్శించి మన్ననలను అందుకున్నారు. తాను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని జీవితంలో ఈ స్థాయికి వచ్చానని ఇంకా తనలాంటి వారు తయారుకావాలంటే ఒక స్పీకర్ గా యువతను చైతన్యవంతం చెయ్యాల్సిఉందని పేర్కొన్నారు. రెండు నెలల పాటు హైదరాబాద్ లో జరిగిన ఈ ఇంపాక్ట్ ట్రైన్ ధ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమంలో వ్యక్తిత్వవికాసం, బాడీలాంగ్వేజ్, నాయకత్వం, మానవ సంబంధాలు, స్ట్రెస్ & కాన్ఫ్లిక్ట్ మానేజ్మెంట్, సామాజిక విలువలు,వైఖరులు, ఎమోషనల్ ఇంటలిజెన్స్, హ్యాబిట్ ఫార్మేషన్, టైమ్ మానేజ్మెంట్, లైఫ్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అనేక అంశాలపై 40 మంది వ్యక్తిత్వ వికాస నిపుణులు,ఎందరో సాధారణ వ్యక్తులను అసాధారణ ప్రతిభ గల వక్తలుగా తయారు చేస్తున్న ప్రముఖ సైకాలాజిస్ట్, ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు మరియు డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ వైస్ ప్రెసిడెంట్ డా.కళ్యాణ్.రెడ్డిస్ లాబ్స్ డైరెక్టర్ డా. ఆది నారాయణ రెడ్డి (ట్రైన్ ది ట్రైనర్స్ 74 వబ్యాచ్.ఇంచార్జ్ )మెంటార్స్ సుధీర్.,త్రినాధ్.దాసరి,శ్రీనివాస్.పెరుమాండ్ల,రాములు,ఓంకారశ్వర్,రాజేశ్వరి వడ్లమాని, మమత మరిపెల్లి, సురేష్ కుమార్ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి 71 మంది ట్రైనర్స్ పాల్గొన్న ఈ ట్రైన్ ది ట్రైనర్ వర్క్ షాప్ 74 వ బ్యాచ్ లో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన తిరుపతి పాటిల్ ను గంపా నాగేశ్వర్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ గా తన మోటివేషనల్ స్పీచెస్ ద్వారా తన యొక్క సేవలను పేద, మధ్య తరగతి విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విధ్యార్తిని విద్యార్థులు చదువులో ఉత్తమ ప్రతిభ కనపరచేటట్లు,అభివృధి చెందేటట్లు,ఉత్తమమైన పౌరులుగా, భారతదేశ భావి భారత మానవ వనరులుగా మార్చడం కోసం విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వవికాసానికి, యువతకు వివిధ అంశాలపై మార్గ నిర్దేశనం అయ్యేలా నా వంతు కృషి చేస్తానని తిరుపతి పాటిల్ పేర్కొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!