కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదిన సందర్భంగా గురువారం హైదరాబాద్ ప్రగతి భవన్ లో తన పుట్టినరోజు సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుని ఎమ్మెల్యే ఆత్రం సక్కు మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్చం అందించారు..ఈ సందర్బంగా ముఖ్య మంత్రి,ఎమ్మెల్యేకి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజా సంక్షేమానికై శ్రమిస్తున్న మీరు ఆయురారోగ్యలతో నిండు నూరేండ్లు ప్రజలకు సేవలందించాలని ఆశీర్వాదిస్తూ,ఆసిఫాబాద్ నియోజకవర్గ గ్రామాల మౌలిక వసతుల అభివృద్ధికి కొరకు త్వరలో ప్రత్యేక అభివృద్ధి నిధులు (SDF) మంజూరుకు హామీ ఇచ్చారు.