గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై ఆందోళన
కేంద్ర ప్రభుత్వం మరోసారి వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపింది. గృహావసరాల వంటగ్యాస్ పై రూ.50 చొప్పున, కమర్షియల్ గ్యాస్ పై రూ.350 చొప్పున ధరలు పెంచిన నేపథ్యంలో నిరసనగా రేపు శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు ఎమ్మార్వో కార్యాలయం షాద్ నగర్ ముందు చేయబోయే ధర్నాలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు మీడియాకు ఒక ప్రకటనలు తెలిపారు. కావున బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ మహిళా విభాగం, అనుబంధ విభాగం సభ్యులు, కార్యకర్తలు మరియు మీడియా మిత్రులు హాజరుకాగలరని కోరారు..