ఘనంగా ఏబీజేఎఫ్ క్యాలెండర్ ని ఆవిష్కరించిన యూనియన్ నాయకులు, జర్నలిస్టులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఆవరణ స్థలంలో అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ గలా క్యాలెండర్ ని యూనియన్ జిల్లా అధ్యక్షులు జాడి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు, జర్నలిస్టులు ఘనంగా క్యాలెండర్ని వారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు దిలీప్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు. అని ప్రశ్నించారు. చిన్న పత్రిక పెద్ద పత్రిక, చిన్న, పెద్ద ఛానల్ అని చిన్న చూపు చూడకుండా సంస్థ ఐడి కార్డ్స్ కలిగిన అర్హులైన వర్కింగ్ జర్నలిస్ట్ లందరికి ప్రభుత్వ అక్రిడేషన్ తో పాటుగా ప్రభుత్వ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరంతరం వర్కింగ్ జర్నలిస్ట్ లకు అండగా ఉంటానని అన్నారు. రోజురోజుకు జర్నలిస్టులపై మీడియా సంస్థలపై దాడులు పెరుగుతున్నాయని ఇది భావ స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని మండిపడ్డారు.మీడియా పై, జర్నలిస్ట్ లపై దాడులను తీవ్రంగా ఖండిస్తానని పేర్కొన్నారు. జర్నలిస్టుల పై దాడులను ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని జిల్లాలోని జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబిజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణపల్లిసురేష్, ప్రధాన కార్యదర్శి,డోంగ్రీ రవీందర్,కోశాధికారి రాటే రవీందర్, సంయుక్త కార్యదర్శి తైదాల వెంకటేష్, చారి కార్తీక్,ఈసి మెంబెర్స్ కంటే ఏలీయా, డోంగ్రీ భారత్, డోంగ్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.