సామాన్యుడి జీవనానికి ఉరితాడు బిగిస్తున్న కేంద్ర ప్రభుత్వం: వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
▪️ కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు ప్రజావ్యతిరేక విధానాలకు ఆద్యం పోస్తూ… పేద ప్రజల నిత్యవసర సరుకులపై క్రమక్రమంగా రేట్లు పెంచుతూ… సామాన్య ప్రజల జీవన విధానానికి ఉచ్చు బిగిస్తుంది.
▪️ BJP పాలనలో వంట గ్యాస్, నూనె, నిత్యవసర సరుకులు మరియు ధాన్యపు గింజలు కొనాలన్నా ముచ్చెమటలు పుట్టిస్తూ…. పేద ప్రజలను ప్రశాంతంగా వండుకుని తినే స్వేచ్ఛ లేకుండా చేస్తుందన్నారు.
▪️ కార్మిక, కర్షక, పేద మధ్య తరగతి ప్రజలపై కక్ష గట్టి రాక్షతత్వం చూపిస్తున్న, కేంద్ర ప్రభుత్వాన్ని, BRS పార్టీ తరపున వ్యతిరేకిస్తూ… పెంచిన రేట్లు వెంటనే తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.