డీపీఆర్ఓ ని మాటమంథి మర్యాదపూర్వకంగా కలిసిన ఏబీజేఎఫ్. జర్నలిస్టులు, నాయకులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు నాయకులు జిల్లా డీపీఆర్ఓ.కృష్ణమూర్తిని వారు మాటమంథి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలు వివరించారు. రాజకీయం, యూనియన్ బలబలగం ఉత్తిడికి లోనై అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు అన్యాయం చేయొద్దని అక్రమంగా మీడియా దొంగ ముసుగులో కొంతమంది అధికారాన్ని అడ్డుపెట్టుకుని సర్పంచ్ లు సైతం అక్రిడేషన్ తీసుకున్నట్లు వార్తలు చూశాం ఇలా దుస్థితి పరిస్థితులు మన జిల్లాకు రాకుండా చూడాలని వేడుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు.అని ప్రశ్నించారు.చిన్న పత్రిక పెద్ద పత్రిక, చిన్న, పెద్ద ఛానల్ అని చిన్న చూపు చూడకుండా సంస్థ ఐడి కార్డ్స్ కలిగిన అర్హులైన వర్కింగ్ జర్నలిస్ట్ లందరికి ప్రభుత్వ అక్రిడేషన్ తో పాటుగా ప్రభుత్వ సదుపాయాలు కల్పించాలని కోరారు. డీపీఆర్ ఓ.కృష్ణమూర్తి సానుకూలంగా స్పందించి. మాటమంథి మర్యాదపూర్వకంగా దాదాపు అర్థగంట వరకు ఏబీజేఎఫ్ జర్నలిస్ట్, నాయకులతో మాట్లాడారు. యూనియన్ అధ్యక్షులు నాయకులు దిలీప్ కుమార్ మాట్లాడుతూ సమస్యలు వివరించి వర్కింగ్ జర్నలిస్ట్ లకు అండగా ఉండాలని కోరడం జరిగింది.రోజురోజుకు జర్నలిస్టులపై,మీడియా సంస్థలపై దాడులు పెరుగుతున్నాయని ఇది భావ స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని మీడియా పై, జర్నలిస్ట్ లపై దాడులను నియంత్రించేందుకు చట్టాలు పటిష్టంగా చేపట్టాలి స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని జిల్లాలోని జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కొమురంభీం జిల్లాలోని ఏబిజేఎఫ్ జర్నలిస్టులు తమ ఆవేదన ను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబిజేఎఫ్. జిల్లాఉపాధ్యక్షులు. కృష్ణపల్లి సురేష్, ప్రధాన కార్యదర్శి, డోంగ్రీ రవీందర్, కోశాధికారి రాటే రవీందర్, సంయుక్త కార్యదర్శి తైదాల వెంకటేష్, చారి కార్తీక్, ఈసి మెంబెర్స్ కంటే ఏలీయా, డోంగ్రీ భారత్, డోంగ్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.