సైఫ్ పై వెంటనే హత్యా నేరం కేసు నమోదు చేసి శిక్షించాలి
*సైఫ్ పై వెంటనే హత్యా నేరం కేసు నమోదు చేసి శిక్షించాలి.ఏబీజేఎఫ్ జర్నలిస్టులు జాడి దిలీప్ కుమార్ జిల్లా అధ్యక్షులు డిమాండ్*కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అఖిల భారత ఫెడరేషన్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టులు ఏ బి జే ఎఫ్ రాష్ట్ర నాయకులు.బంక శ్రీనివాస్.జిల్లాఉపాధ్యక్షులు.కృష్ణపల్లిసురేష్, తైదాల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి.కారుకూరి శ్రీనివాస్, కోశాధికారి,రాటే రవీందర్, సంయుక్త కార్యదర్శి డోంగ్రీ రవీందర్, భారత్, కార్తీక్, సత్యనారాయణ, శరత్ చంద్ర, యోహాను, ఏలీయా, శ్రీనివాస్, పలువురు మాట్లాడుతూ రోజులుగా మృత్యువుతో పోరాడిన వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి హైదరాబాద్ నిమ్స్‌లో ఆదివారం (ఫిబ్రవరి 26) మృతి చెందింది. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రీతి ఫిబ్రవరి 22న హానికారక ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమెను తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. ఆరోగ్యం ప్రమాదకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.తొలుత వెంటిలేటర్‌పై, అనంతరం ఎక్మోపై చికిత్స అందించారు. ఐదు రోజులు మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరికి తనువుచాలించింది. ఆత్మహత్యాయత్నానికి ముందు రోజు అంటే ఫిబ్రవరి 21న తల్లి శారదకు ఫోన్ చేసి ప్రీతి మాట్లాడిన ఆడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపింది. సీనియర్ పీజీ విద్యార్థి అయిన సైఫ్ తనతో పాటు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడని, వారంతా బయటకు చెప్పుకోవడానికి భయడుతున్నారని తల్లితో చెప్పుకుని ప్రీతి బాధపడ్డారు. సీనియర్లంతా ఒక్కటై తనను ఒంటరి చేస్తున్నారని వాపోయారు.ఒక ఆడపిల్ల ఇంతగా భయపడుతూ నరకయాతన జీవితం గడుపుతున్నారని పేర్కొన్నారు.జనగామ మండలం, గిర్నీ తాండా కు చెందిన మెడికో విద్యార్థిని ప్రీతి మృతి కి సైఫ్ కారణం.ర్యాగింగ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మ హత్యాయత్నం చేసిన కేఎంసీ పీ.జీ వైద్య విద్యార్ధిని ప్రీతి మృతి చెందడం చాలా బాధాకరమని.అఖిల భారత్ జర్నలిస్ట్ ఫెడరేషన్.కొమురంభీం జిల్లా అధ్యక్షులు జాడి దిలీప్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ తనను వేధిస్తున్నాడని ప్రీతి పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని కెఎంసి ప్రిన్సిపాల్, హెచ్ ఓ డి , స్థానిక పోలీసులుపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గిరిజన కుటుంబానికి చెందిన ప్రీతి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ప్రతిష్టాత్మక వైద్య విద్యను కొనసాగిస్తూ సైఫ్ వేధింపులకు తాళలేక ఇలా నిష్క్రమించడం చాలా విషాదకరమన్నారు.ప్రీతిపై కక్ష కట్టి మానసికంగా వేధిస్తూ నేడు తన చావుకు కారణమైన సైఫ్ పై వెంటనే హత్యా నేరం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షంచాలి అని అన్నారు.ప్రీతి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తన మొబైల్ ను ఉపయోగించి కేసును నీరుగార్చడానికి ప్రయత్నించిన వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ మొత్తం ఉదంతంపై హైకోర్టు సెట్టింగ్ న్యాయ మూర్తి ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసి భవిష్యత్ లో ప్రీతి లాంటి విద్యార్థులు అర్ధాంతరంగా తమ జీవితాన్ని ముగించుకోకుండా కాపాడవలసిన అవసరం ప్రభుత్వంపై ఉంద్నారు .ఈ కార్యక్రమంలో.ఏబిజేఎఫ్ రాష్ట్ర నాయకులు.బంక శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు.కృష్ణపల్లిసురేష్,తైదాల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి. కారుకూరి శ్రీనివాస్,కోశాధికారి,రాటే రవీందర్, సంయుక్త కార్యదర్శి డోంగ్రీ రవీందర్,భారత్, కార్తీక్, సత్యనారాయణ, శరత్ చంద్ర, యోహాను, ఏలీయా, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.