*జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అధికారులు సన్నద్ధం కావాలి.*
వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి వచ్చే వినతులను సంతృప్తి స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా జగనన్నకు చెబుదాం అనే కొత్త కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఇందులో భాగంగా మండల కేంద్రమైన ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీవో కే.జాన్ లింకన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి బదులుగా జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి అంబేద్కర్ కొనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడుతూ అన్ని మండలంలో ప్రతి అధికారులు కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని ఆదేశించారు,ప్రజలనుండి వచ్చే వినతులను శాఖల వారిగా విభజించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.ప్రతి వినతిని ట్రాకింగ్ చేస్తూ పరిష్కారం అయ్యేలా వారంవారం ఆడిట్ చేయాలని సూచించారు.ఫిర్యాదుల కోసం ఇప్పటికే వున్న స్పందన కాల్‌సెంటర్లను జగనన్నకు చెబుదాంతో అనుసంధానించారని వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పరిష్కారం కానివి వుంటే అర్జీదారుడు తన సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేసిందనే సంతృప్తి వుండేలా వ్యవహరించాలన్నారు.వినతులను పరిష్కరించే అంశంలో అంతా అప్రమత్తంగా వుండాలని ఆయన అన్నారు.అలాగే ఎంపీడీవో జాన్ లింకన్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే వినతులను సంతృప్తస్థాయిలో పరిష్కరించడం ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.