పన్నుల పేరుతో ప్రజలను వేధిస్తే సహించేది లేదు -బిజెపి జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి
వికారాబాద్ : పన్నుల పేరుతో అధికారులు ప్రజలను వేధిస్తే చూస్తూ ఊరుకునేది లేదని బిజెపి జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి అన్నారు. పట్టణ అధ్యక్షులు శ్రీశైలం ఆధ్వర్యంలో ప్రజా గోషా బిజెపి భరోసా కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసిన సందర్భంగా పరిగికి విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధిని మరిచిపోయి కేవలం ఆదాయాలను తెచ్చుకునే మార్గాల కోసం ప్రజలను ఎంత ఇబ్బందులకైనా గురిచేయడానికి వెనకాడటం లేదని ఈ సందర్భంగా వారు అన్నారు. పరిగి పట్టణంలోని అనేక కాలనీలలో మంచినీటి సౌకర్యం కరువైందని అన్నారు. పరిగి పట్టణంలో పారిశుద్ధ్య పనులు, అంతర్గత రోడ్లు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయని, వీటిని వెంటనే ప్రభుత్వము, అధికారులు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పట్టణ పరిధిలో మరియు గ్రామాల్లో కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్న సంక్షేమ పథకాలే తప్ప, రాష్ట్ర ప్రభుత్వము గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి చేసిందేమీ లేదని వారు దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రాంచందర్, అసెంబ్లీ కన్వీనర్ నరసింహ, జిల్లా కార్యదర్శిలు పెంటయ్య, హరికృష్ణ, నాయకులు బాలకృష్ణారెడ్డి, దోమ రమేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.