ప్రీతి నాయక్ మరణానికి కారణమైన వారిని బహిరంగంగా ఉరి తీయాలి:… నవీన్ రాథోడ్

ప్రీతి నాయక్ మరణానికి కారణమైన వారిని బహిరంగంగా ఉరి తీయాలి:… నవీన్ రాథోడ్

సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు అంగోత్ రాంబాబు నాయక్ ఆదేశాల మేరకు గిరిజన బిడ్డ వైద్య విద్యార్థి డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ మరణానికి కారునమైనటువంటి వారిని తక్షణమే శిక్షించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిస్తూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల బంద్ నిర్వహించిన సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ రాథోడ్ మాట్లాడుతూ.. వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజ్ కెఎంసి నందు జూనియర్ వైద్య విద్యార్థిగా విద్యను అభ్యసిస్తున్నటువంటి డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ ర్యాగింగ్ భూతం వల్ల మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి గత ఐదు రోజుల నుండి హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ నందు మృత్యువుతో పోరాడి మరణించారు ప్రీతి నాయక్ మరణం పట్ల సేవాలాల్ సేన సంఘం విచారం వ్యక్తం చేస్తూ డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ మరణానికి కారణమైనటువంటి సైఫ్ మరియు తోటి వ్యక్తులను బహిరంగంగా ఉరితీయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిర్లక్ష్యం వహించినటువంటి కాలేజీ ప్రిన్సిపాల్ ని మరియు యాజమాన్యాన్ని తక్షణమే సస్పెండ్ చేయాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ లకావత్ నాగేశ్వరరావు నాయక్ భారతీయ గోర్ బంజారా పోరాట సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ భారతీయ గోర్ బంజారా పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి తేజావత్ రవికుమార్ ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భుఖ్యా రవి నాయక్ ఎల్ హెచ్ పి ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వాంకుడోత్ కిషన్ నాయక్ ఎల్ హెచ్ పి ఎస్ మండల నాయకులు శివా నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!