మహానందీశ్వరుని హుండీ ఆదాయం రూ 48.76 లక్షలు..

మహానందీశ్వరుని హుండీ ఆదాయం రూ 48.76 లక్షలు..

స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 28, మహానంది:

మహానంది పుణ్యక్షేత్రంలోని హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను ఆల ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ఆలయంలోని అభిషేక మండపంలో లెక్కింపు నిర్వహించారు. మంగళవారం ఉభయ దేవాలయంలో 48 రోజులపాటు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా48,76,718 రూపాయల ఆదాయం లభించింది అన్నారు.ఇందులో ఉభయ దేవాలయములలోనీ హుండీల ద్వారా 47,84,402 రూపాయలు రాగా, అన్నదానం హుండీ ద్వారా 66,027, గోశాల హుండి ద్వారా 26,289 రూపాయలతో కలిపి మొత్తం ఈ ఆదాయం లభించినట్లు ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, గ్రూప్ టెంపుల్ అధికారులు, ఆలయ అధికారులు, సత్య సాయి సేవ సమితి భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!