51 మందికి కల్యాణ లక్ష్మీ చెక్కులు ఎమ్మెల్యే ఘనంగా లబ్దిదారులకు అందజేత
స్టూడియో10టీవీ ప్రతినిధి కృష్ణపల్లిసురేష్ ఫిబ్రవరి 25
ఆడపిల్లల తండ్రి భారాన్ని తగ్గించడం కోసం కళ్యాణ లక్ష్మి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని శనివారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో 51, 05,916 రూపాయలు విలువ చేసే 51 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆత్రం సక్కు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి అనే అద్భుతమైన పథకాన్ని రూపొందించడం జరిగిందని గతంలో 50,000 ఉన్న పథకాన్ని నేడు ఒక్క లక్ష ఒక వంద 16 రూపాయలుగా మార్చి బడుగు బలహీనా వర్గాల అభ్యున్నతికి తోడ్పడుతున్నాడని తెలిపారు ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారని మొన్నటికి మొన్న న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మరెన్నో పథకాలు తీసుకువచ్చి ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అనంత రాజ్ తిర్యాని గ్రామ సర్పంచ్ కోర్వేత సింధుజ తిరుపతి ఉప సర్పంచ్ తోట లచ్చన్న ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి జడ్పిటిసి అత్రం చంద్రశేఖర్ ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హనుమాన్ల జగదీష్, తిర్యాని ఎంపీటీసీ బుర్ర రాజ్యలక్ష్మి మధుకర్ పిఎసిఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు మడావి గుణవంత్ రావు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులుకుర్సేంగ బాదిరావు ఎదులా పాడు సర్పంచ్ మడవి గోపాల్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ తల్ల శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శంకర్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యం రాజయ్య, తాళ్ల కొమురయ్య కాసం రాజయ్య కిలిశెట్టి శంకర్, ముత్యం బుచ్చన్న, బ్రహ్మం, గోయగాం గ్రామ కమిటీ అధ్యక్షులు పొలాస రమేష్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.