పడకేసిన పారిశుధ్యం
స్పందించని అధికారులు
గ్రామస్తులే పారిశుద్ధ్య పనులు నిర్వహణ
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 25, మహానంది:
మహానంది మండలం అబ్బిపురం గ్రామంలో పారిశుధ్యం పై చర్యలు తీసుకోవాలని పలుసార్లు గ్రామస్తులు అధికారులకు తెలియజేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో ప్రజలు విసుగు చెంది స్వయంగా సైడు కాలువలలో మురికి మట్టిని గుర్క పత్తి సుబ్బారెడ్డి, మునెమ్మ, బాయికాడి వెంకటరాముడు కలిసి తొలగించి వినూత్న నిరసన చేపట్టారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై అధికారులకు తెలియజేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, మరియు పారిశుద్ధ్య కార్మికులకు సక్రమంగా జీతాలు వేయకపోవడంతో పారిశుద్ధ్య పనులు జరగడంలేదని పలువురు విమర్శించారు. మండలంలో అధికారుల, పాలకుల పర్యవేక్షణ లోపం ఉన్నట్లు అద్దం పట్టినట్లు కనిపిస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి గ్రామాలలో నెలకొన్న పారిశుద్ధ్య పనులపై చర్యలు తీసుకోవాలని కోరారు.