సామాన్యులకో న్యాయం, పోలీసులకో న్యాయమా?
చట్టాలు ఎవరికీ చుట్టాలు కావు,కాలేవు,కాబోవు అంటుంటారు కొందరు. కానీ గద్వాల పట్టణంలో మందిది మంగళవారం, మనది సోమవారం అన్న చందంగా వుంది ఒకరిద్దరి పోలీసుల తీరు.సామాన్యులు రాంగ్ రూట్ లో వెళ్లిన ఫైనే, త్రిబుల్ రైడింగ్ వెళ్లిన ఫైనే, ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లిన ఫైనే…. వేసే అధికారులు ఇవేవి పోలీస్ వాహనాలకు వర్తించవు అన్నట్టుగా వ్యవహారిస్తూ ఉంటారని ప్రజల అభిప్రాయం.ప్రజల మాట అక్షర సత్యమే అన్నట్టుగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ముగ్గురు ఓ ద్విచక్రవాహనంపై వెళ్తున్న కూడ పోలీసులు ఆపలేదంటే దాని వెనక పోలీస్ అని రాయబడి వుంది అందుకే ఆపలేదనే చర్చ నడుస్తుంది. వడ్డించే వాడు మనోడు ఉంటే భారా ఖున్ మాఫ్ అన్నట్టుగా చేయొచ్చు అన్నది రుజువు చేస్తున్నారు కొంతమంది సిబ్బంది.ఏది ఏమైనా సామాన్యుల వాహనాలకో న్యాయం, పోలీస్ వాహనాలకో న్యాయమా అంటూ ఆక్షర్యం వ్యక్తం చేస్తున్నారు పుర ప్రజలు, మేధావులు, విజ్ఞులు.