గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్యం
కొలాం సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు
Studio10Tv Journalist Krishnapalli Suresh
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని మారుమూల గ్రామమైన సర్కెపల్లి కొలాం గూడను సందర్శించిన సందర్భంలో గ్రామస్తులు అనేక సమస్యలు విన్నవించారని.కొలాం సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్నిగా అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిషన్ భగీరథ నీటి సౌకర్యం అందటం లేదు రోడ్డు రవాణా సౌకర్యం లేనందున వర్షాకాలము గర్భిణీ స్త్రీలు,ఆరోగ్య సమస్యలు వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది పోలీస్ శాఖ వారు ఏర్పాటుచేసిన బోరింగ్ ఉంది అని తెలిపారు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుపుతున్నప్పటికీ నేటికీ కొలాం గిరిజనులకు ఆధునిక అభివృద్ధి సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కోలాం సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్రం జల్పత్ రావ్ కుంరం భీంరావ్ లేతు రాము తదితరులు గ్రామస్తులు ఉన్నారు.