గద్వాల తహసీల్దార్ సంతకం ఫోర్జరీ బడా లీడర్ నయా స్కామ్
గద్వాల : ఎమ్మార్వో ఫోర్జరీ సంతకాల స్కామ్ మళ్లీ రచ్చ లేపుతోంది. స్వతహగా రాజకీయ నాయకుడైన ఒక వ్యక్తి తన సొంత హ్యాండ్ రైటింగ్‌తో పట్టా తయారు చేసి కబ్జా చేస్తున్నాడు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. గద్వాల్ రాజకీయల్లో పలుకుబడి ఉన్న ఒక లీడర్ ఈ నిర్వాకం చేస్తున్నట్లు సమాచారం. తాహసీల్దార్ కార్యాలయంలో ఇళ్ల పట్టాల రికార్డులు కనిపించడం లేదని తెలుస్తోంది. ఫోర్జరీతో ఇళ్లు నిర్మిస్తున్నారు కబ్జాదారులు. ఒకరి ప్లాట్లలో వేరొకరు ఇళ్లు నిర్మిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అసలు నిజమైన పటాదారుడు ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో భూ లబ్ధిదారుల కష్టాలు పెరిగిపోయాయి. ఆఫీసుల చుట్టు తిరగాల్సిన దుస్థుతి నెలకొంది. అటు కబ్జాదారులు మాత్రం ఇల్లు నిర్మాణం చేసి దానికి ఒక కరెంట్ మీటర్ కూడా పెట్టుకుంటున్నారు. ఆ కరెంట్ మీటర్ చూపించి ఇల్లు మాదే అంటున్నారు. స్థలం కూడా మాదేనని నిజమైన లబ్ధిదారున్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనికి సంబంధించిన పట్టాదారుడు ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో మొరపెట్టుకున్నా ఎలాంటి సహాయం చేయడం లేదు అధికారులు. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో డీకే అరుణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. సుమారు 3,600 పట్టాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పట్టాలపై అక్రమార్కులు డూప్లికేట్ పట్టాలు తయారుచేస్తున్నారు. గొడవలు కూడా సృష్టిస్తున్నారు. వారి ప్లాట్‌లకు న్యాయం చేస్తామని చెప్పి ఒక్కొక్కరితో డబ్బులు వసూలు చేసి రాజీ పరుస్తున్నారు. ఒక ఫ్లాట్‌పై మూడు పట్టాలను సృష్టించి వారి మధ్యనే గొడవలు పెడుతూ వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఎవరు ఎక్కువగా ఇస్తే వారికి న్యాయం చేస్తున్నారు. ఫోర్జరీ పట్టాలతో 3,600 పట్టాల సంఖ్య తొమ్మిది వేలకు చేరుకుంది. ఇప్పుడు ఎలక్షన్‌లు రానుండడంతో ఈ సంఖ్య 15,000 దాటే అవకాశముంది. గద్వాల కలెక్టర్ ఈ అక్రమ పట్టాలపై చర్యలు తీసుకోవాలని ఇదివరికే ఆదేశించారు. అయినా ఎవరి మాట లెక్క చేయకుండా ఇప్పటికీ అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నాయి.