పోలీసు అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్పీ
స్టూడియో10టీవీ ప్రతినిధి కృష్ణపల్లిసురేష్ 23 ఫిబ్రవరి 2023
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.విధి నిర్వహణలో పాటించాల్సిన నియమాలు,జాగ్రత్తల గురించి ఎస్పి వివరించడం జరిగింది.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఎస్పీలు ,ఆయా పోలీస్ స్టేషన్ ల నుండి ఎస్.హెచ్.ఓ లు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.పోలీస్ అధికారులు,సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, అత్యంత బాధ్యతయుతమైన వ్యవస్థ పోలీస్ శాఖ అని అన్నారు.ప్రజల ధన,మాన, ప్రాణాలను కాపాడడంలో మన పోలీస్ శాఖ పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. విధి నిర్వహణలో అప్రమత్తత ముఖ్యమని ,సమయం, సందర్భాన్ని బట్టి డ్యూటీలో మార్పులు ఉంటాయి కావున వాటికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే చిన్న చిన్న సంఘటనలు, గొడవలు పట్ల కౌన్సిలింగ్ నిర్వహించాలని , అనవసర విషయాల పట్ల పోలీస్ సిబ్బంది చాకచక్యంగా ఉండాలని పేర్కొన్నారు. నిషేధిత మత్తు పదార్థాల పట్ల కఠినంగా వ్యవహరించాలని, ఏ ముఖ్య సమాచారమైన, సమస్యలైనా డయల్ 100 కు కాల్ చేసి తెలియజేసేలా ప్రజలను చైతన్య పరచాలని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రజల్లో చైతన్యపరచాలని, నేరాలను అదుపు చేయడానికి సీసీ కెమెరాల ముఖ్య పాత్ర వహిస్తాయని తెలిపారు. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయడం ముఖ్యమని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎ.ఆర్ భీమ్ రావు , టాస్క్ఫోర్స్ సిఐ సుధాకర్, ఐటి కోర్ ఎస్సై ప్రవీణ్ పాల్గొన్నారు.